అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Golbal markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. యూఎస్, యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ముగిశాయి.
శుక్రవారం ఉదయం చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు మినహా మిగతా ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. గిప్ట్ నిఫ్టీ (Gift nifty) లాభాలతో ఉంది.
Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు US markets..
వాల్‌స్ట్రీట్(Wallstreet)లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రధానంగా టెక్ స్టాక్‌లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో గత సెషన్లో నాస్డాక్ (Nasdaq) 1.57 శాతం, ఎస్అండ్పీ 0.99 శాతం నష్టంతో ముగిశాయి.
ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.11 శాతం లాభంతో ఉంది. మెటా(Meta) షేర్ల ధర 11.3 శాతం, టెస్లా 4.63 శాతం, ఆల్ఫాబెట్ 2.5 శాతం, ఎన్వీడియా 2.04 శాతం క్షీణించాయి.
Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు (European markets)..
ఎఫ్టీఎస్ఈ 0.04 శాతం పెరగ్గా.. సీఏసీ 0.53 శాతం, డీఏఎక్స్(DAX) 0.02 శాతం పడిపోయాయి.
Pre Market Analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..
ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.19 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.74 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.64 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
సింగపూర్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్స్ టైమ్స్ ఫ్లాట్‌గా ఉంది. చైనాకు చెందిన షాంఘై 0.36 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.19 శాతం నష్టాలతో ఉన్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ 0.12 శాతం లాభంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 3,077 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు వరుసగా ఆరో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 2,469 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.14 నుంచి 0.75కు పడిపోయింది. విక్స్(VIX) 0.79 శాతం పెరిగి 12.07 వద్ద ఉంది. ఇది రెండు నెలల గరిష్టం. పీసీఆర్ తగ్గుతుండడం, విక్స్ పెరుగుతుండడం మార్కెట్లో వీక్నెస్ను సూచిస్తున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.44 శాతం తగ్గి 64.09 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 49 పైసలు బలహీనపడి 88.70 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.10 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.46 వద్ద కొనసాగుతున్నాయి.
- రూపాయి బలహీనపడుతుండడం, ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం భారత మార్కెట్లకు ఆందోళన కలిగించే అంశాలు. అయితే క్రూడ్ ఆయిల్(Crude oil) ధర తగ్గుతూ రావడం సానుకూలాంశం.

