అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | గ్లోబల్ క్యూస్ ఇన్వెస్టర్లలో జోష్ నింపుతున్నాయి. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు(Asian markets) పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ లాభాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు US Markets..
టెక్ స్టాక్స్(Tech stocks) జోరుమీదున్నాయి. ఒరాకిల్ 6.6 శాతం, ఎన్వీడియా 3.9 శాతం, బ్రాడ్కాం 3.2 శాతం పెరిగాయి. గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 1.23 శాతం, ఎస్అండ్పీ 0.88 శాతం లాభంతో ముగిశాయి. ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.21 శాతం లాభంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు European Markets..
ఎఫ్టీఎస్ఈ 0.60 శాతం, డీఏఎక్స్(DAX) 0.37 శాతం, సీఏసీ 0.01 శాతం పెరిగాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు Asian Markets..
ఉదయం 7.50 గంటల సమయంలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.91 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.74 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.26 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.72 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.52 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.23 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.61 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు వరుసగా మూడో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 1,830 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
డీఐఐలు వరుసగా 80వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 5,722 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. - నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.83 నుంచి 1.13కి పెరిగింది. విక్స్(VIX) 1.91 శాతం తగ్గి 9.52 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 99 పైసలు బలపడి 89.27 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.16 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.62 వద్ద కొనసాగుతున్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.76 శాతం పెరిగి 60.95 డాలర్ల వద్ద ఉంది.
- మన దేశ నవంబర్ నెలకు సంబంధించిన మౌలిక సదుపాయాల రంగ ఉత్పత్తి గణాంకాలు ఈనెల 22న వెలువడనున్నాయి. 23న ఆర్బీఐ(RBI) మార్కెట్ రుణ సేకరణ వేలం నిర్వహించనుంది.
- కీలకమైన యూఎస్ త్రైమాసిక జీడీపీ డాటా(GDP data) ఈనెల 23న వెలువడనుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఇది కీలకమైన ఇన్‌పుట్‌గా నిలవనుంది.