ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis on August 21 | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను...

    Pre Market Analysis on August 21 | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis on August 21 | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. టెక్‌ స్టాక్స్‌లో నష్టాలతో గత ట్రేడింగ్ సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌(Wall street) నష్టాలతో ముగియగా.. యూరోప్‌ మార్కెట్లు సైతం ఒత్తిడికి గురయ్యాయి. గురువారం ఉదయం జపాన్‌(Japan), హాంగ్‌కాంగ్‌ స్టాక్‌ మార్కెట్లు మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం పాజిటివ్‌గా ఉంది.

    Pre Market Analysis on August 21 | యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    యూఎస్‌ ఫెడ్‌ జూలై సమావేశానికి సంబంధించిన మినట్స్‌ యూఎస్‌ మార్కెట్లపై ప్రభావం చూపాయి. గత ట్రేడింగ్ సెషన్‌ నాస్‌డాక్‌(Nasdaq) 0.67 శాతం, ఎస్‌అండ్‌పీ 0.24 శాతం నష్టపోయాయి. ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.03 శాతం లాభంతో సాగుతోంది.

    Pre Market Analysis on August 21 | యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 1.07 శాతం లాభాలతో ముగియగా.. డీఏఎక్స్‌ 0.60 శాతం, సీఏసీ 0.08 శాతం నష్టపోయాయి.

    Pre Market Analysis on August 21 : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం ఎక్కువగా లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.19శాతం, కోస్పీ(Kospi) 0.97 శాతం,
    షాంఘై 0.42 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.1 శాతం లాభంతో ఉన్నాయి. నిక్కీ 0.53 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.04 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.11 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు రెండోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 1,100 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐలు 32వ ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 1,806 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.14 నుంచి 1.28 కు పెరిగింది. విక్స్‌(VIX) 0.04 శాతం తగ్గి 11.79 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.37 శాతం పెరిగి 67.08 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 87.07 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.30 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.25 వద్ద కొనసాగుతున్నాయి.

    యూఎస్‌(US)లో అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన ఉపాధి అవకాశాల విషయంలో ఎక్కువ మంది ఫెడ్‌ విధాన నిర్ణేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్‌ మార్కెట్లలో ఒత్తిడి కనిపించింది.
    గ్లోబల్‌గా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, యూఎస్‌ టారిఫ్‌లతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాన్ని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యులు వ్యక్తం చేశారు. అయితే ఇన్ల్ఫెషన్‌ అదుపులో ఉన్న దృష్ట్యా మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని మార్కెట్‌ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Railway Trial Run | సిద్దిపేట–చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్(Manoharabad)​ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్​ పనులు సాగుతున్న...

    Land Auction | రూ.70 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Auction | ఎకరం భూమి ఏకంగా రూ.70 కోట్లు పలికింది. హైదరాబాద్(Hyderabad)​ నగరంలో...

    LIC Notification | ఎల్‌ఐసీ నుంచి మరో నోటిఫికేషన్‌.. 350 పోస్టుల భర్తీకి చర్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : LIC Notification | నిరుద్యోగులకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) గుడ్‌...

    Google Pixel 10 | ఏడేళ్ల వరకు అప్‌డేట్స్.. గూగుల్‌ పిక్సెల్‌ 10 ప్రత్యేకతలివే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Google Pixel 10 | ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గూగుల్‌ పిక్సల్ 10 (Google Pixel...

    More like this

    Railway Trial Run | సిద్దిపేట–చిన్నకోడురు మధ్య రైల్వే ట్రయల్​ రన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Trial Run | మనోహరాబాద్(Manoharabad)​ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్​ పనులు సాగుతున్న...

    Land Auction | రూ.70 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Auction | ఎకరం భూమి ఏకంగా రూ.70 కోట్లు పలికింది. హైదరాబాద్(Hyderabad)​ నగరంలో...

    LIC Notification | ఎల్‌ఐసీ నుంచి మరో నోటిఫికేషన్‌.. 350 పోస్టుల భర్తీకి చర్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : LIC Notification | నిరుద్యోగులకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) గుడ్‌...