ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis | వాల్‌స్ట్రీట్‌(Wall street) రికార్డు హైస్‌ వద్ద కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు సైతం గత ట్రేడిoగ్‌ సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    యూఎస్‌ ఫెడ్‌(US Fed) వచ్చేనెలలో వడ్డీ రేట్లను కట్‌ చేసే అవకాశాలు ఉండడంతో వాల్‌స్ట్రీట్‌ పరుగులు తీస్తోంది. గత ట్రేడిoగ్‌ సెషన్‌ ఎస్‌అండ్‌పీ(S&P) 0.32 శాతం, నాస్‌డాక్‌ 0.14 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.08 శాతం లాభంతో సాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ, డీఏఎక్స్‌(DAX)లు 0.66 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం లాభపడ్డాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    గురువారం ఉదయం 7.50 గంటల సమయంలో షాంఘై(Shanghai) 0.41 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.21 శాతం లాభంతో ఉన్నాయి. నిక్కీ 1.33 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.52 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.41 శాతం, కోస్పీ 0.14 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.33 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌(Flat) టు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా మూడో రోజూ నికర అమ్మకందారులుగానే నిలిచారు. నికరంగా రూ. 3,644 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు 28వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 5,623 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.78 నుంచి 1.08కు పెరిగింది. విక్స్‌(VIX) 0.76 శాతం తగ్గి 12.14కి చేరింది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.30 శాతం తగ్గి 65.83 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 27 పైసలు బలపడి 87.45 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.26 శాతం తగ్గి 4.23 శాతం వద్ద ఉంది.
    • యూరోతో పోల్చితే డాలర్‌ విలువ వరుసగా క్షీణిస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ 0.12 శాతం తగ్గి 97.68 వద్ద కొనసాగుతున్నాయి.
    • సెన్సెక్స్‌ ఎఫ్‌అండ్‌వో వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో వోలటాలిటీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రేపు స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయి.

    Latest articles

    Vesey Pace | లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీర‌ని విషాదం.. తండ్రి వెసీ పేస్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vesey Pace | ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు...

    Balakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం(Pushpa 2...

    Makloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు...

    PM Modi | దేశ విభ‌జ‌న విషాద‌క‌ర అధ్య‌య‌నం.. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | దేశ విభ‌జ‌న అత్యంత విషాద‌క‌ర అధ్య‌య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ...

    More like this

    Vesey Pace | లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీర‌ని విషాదం.. తండ్రి వెసీ పేస్ కన్నుమూత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vesey Pace | ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు, భారత హాకీ జట్టు మాజీ ఆటగాడు...

    Balakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం(Pushpa 2...

    Makloor mandal | చెరువులోకి దూసుకెళ్లిన కారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Makloor mandal | కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మాక్లూరు...