ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : యూఎస్‌(US), యూరోప్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ సైతం పాజిటివ్‌గా ఉంది.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    గత ట్రేడింగ్ సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 1.02 శాతం, ఎస్‌అండ్‌పీ 0.51 శాతం పెరిగాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.11 శాతం నష్టంతో సాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    సీఏసీ 0.85 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.67 శాతం, డీఏఎక్స్‌ 0.46 శాతం లాభంతో ముగిశాయి.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets) ..

    ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.23 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ Taiwan Stock Exchange 0.93 శాతం, కోస్పీ 0.51 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.22 శాతం లాభాలతో ఉండగా.. షాంఘై 1.25 శాతం, హాంగ్‌సెంగ్‌ 0.50 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.62 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈ రోజు భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

    గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా ఎనిమిదోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 1,666 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు ఏడో రోజూ నికరంగా రూ. 2,495 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.99 నుంచి 1.21 కు పెరిగింది. విక్స్‌(VIX) 4.12 శాతం తగ్గి 10.93 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.56 శాతం తగ్గి 67.22 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 88.07 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.22 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.18 వద్ద కొనసాగుతున్నాయి.
    • జీఎస్టీ కౌన్సిల్‌ 396 వస్తువులపై జీఎస్టీ(GST) రేటును తగ్గించింది. చాలా వస్తువులు జీరో ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చాయి. దీన్ని మార్కెట్లు పాజిటివ్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
    • లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై మాత్రం 40 శాతం పన్ను రేటును ప్రతిపాదించినందున ఆయా రంగాలకు చెందిన స్టాక్స్‌ నెగెటివ్‌గా ట్రేడ్‌ అయ్యే అవకాశాలున్నాయి.

    గత క్వార్టర్‌లో జీడీపీ(GDP) వృద్ధి 7.8 శాతంగా ఉండడం, డాలర్‌ బలహీనపడుతుండడం, ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు, జీఎస్టీ సంస్కరణలు ఎఫ్‌ఐఐల ఆలోచన ధోరణిని మార్చే శక్తిమంతమైన సాధనాలుగా నిలుస్తాయని మార్కెట్‌ భావిస్తోంది. త్వరలోనే వారు కొనుగోలుదారులుగా మారతారని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్‌లో ర్యాలీకి కారణమవుతుందని పేర్కొంటున్నారు.

    More like this

    Jharkhand | జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Jharkhand | జార్ఖండ్‌లో తీవ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బంది మృతి చెందారు....

    CM Tour | సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

    అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి : CM Tour | జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. ఉదయం 11:30 గంటలకు ఆయన...

    Donald Trump | ఇండియాపై మ‌రిన్ని చ‌ర్య‌లు.. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలుపై ట్రంప్ ఆగ్ర‌హం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్‌పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి...