అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis: యూఎస్(US), యూరోప్ మార్కెట్లు వరుసగా లాభాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) స్వల్ప లాభంతో ఉంది.
Pre market analysis: యూఎస్ మార్కెట్లు (US markets)..
నాస్‌డాక్(Nasdaq) 0.48 శాతం, ఎస్‌అండ్‌పీ 0.26 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం నష్టంతో సాగుతోంది.
Pre market analysis: యూరోప్ మార్కెట్లు (European markets)..
ఎఫ్‌టీఎస్‌ఈ FTSE 0.16 శాతం, సీఏసీ 0.13 శాతం, డీఏఎక్స్ 0.02 శాతం లాభాలతో ముగిశాయి.
Pre market analysis: ఆసియా మార్కెట్లు (Asian markets)..
మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు Asian markets మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.14 శాతం, సింగపూర్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్స్ టైమ్స్(Straits times) 0.21 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.15 శాతం, లాభంతో కొనసాగుతుండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 0.13 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.07 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.04 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.02 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు వరుసగా ఆరో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 2,831 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిచారు. డీఐఐ(DII)లు వరుసగా 25వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 3,845 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.63 నుంచి 0.71 కు పెరిగింది. విక్స్(VIX) 0.53 శాతం తగ్గి 11.37 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.71 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలహీనపడి 88.76 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.15 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.98 వద్ద కొనసాగుతున్నాయి.
- ట్రంప్(Trump) సుంకాల మోత మోగిస్తూనే ఉన్నారు. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాలనుంచి దిగుమతి చేసుకునే కలప, కిచెన్ క్యాబినెట్‌లు తదితర ఉత్పత్తులపై 10 నుంచి 50 శాతం వరకు టారిఫ్స్ పెంచనున్నట్లు ప్రకటించారు.
- సెయింట్ లూయీస్ ఫెడ్ అధ్యక్షుడు ఆల్బర్ట్ మరిన్ని రేట్ కట్‌లకు అనుకూలంగా ఉన్నామని చెబుతూనే ద్రవ్యోల్బణం విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇన్ల్ఫెషన్ అదుపులోకి వచ్చేంతవరకు వడ్డీరేట్లను ఎక్కువగానే ఉంచాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
- ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్(RBI MPC meeting)కు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడవనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్ రేంజ్ బౌండ్‌లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు.