Homeతాజావార్తలుPre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగగా.. యూరోపియన్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లు (Golbal markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగింది.

యూరోపియన్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగా ఉన్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ నెగెటివ్‌గా ఉంది.

Pre market analysis | యూఎస్‌ మార్కెట్లు..

యూఎస్‌ మార్కెట్లను టెక్‌ స్టాక్స్‌ ముందుండి నడిపిస్తున్నాయి. గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.43 శాతం, ఎస్‌అండ్‌పీ 0.17 శాతం పెరిగాయి.

ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 0.17 శాతం నష్టంతో ఉంది. అమెజాన్‌ (Amazon) షేరు ధర 4 శాతం, టెస్లా 2.59 శాతం, ఎన్వీడియా 2.17 శాతం పెరిగాయి.

Pre market analysis | యూరోప్‌ మార్కెట్లు..

డీఏఎక్స్‌(DAX) 0.72 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.16 శాతం, సీఏసీ 0.14 శాతం పడిపోయాయి.

Pre market analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.41 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.03 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.

సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ 1.81 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.19 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.07 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.12 శాతం నష్టంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 1,883 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

డీఐఐ(DII)లు వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 3,516 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.64 నుంచి 0.78 కు పెరిగింది. విక్స్‌(VIX) వరుసగా ఆరో సెషన్‌లోనూ పెరిగింది. 4.22 శాతం పెరిగి 12.67 కు చేరింది. విక్స్‌ 13 దాటితే బేర్స్‌ ఆధిపత్యం పెరిగే అవకాశాలు ఉంటాయి.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.72 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక పైస బలహీనపడి 88.78 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.11 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 99.99 వద్ద కొనసాగుతున్నాయి.
  • యూఎస్‌ పీఎంఐ(PMI) డాటా వరసగా ఎనిమిదో నెలలోనూ తగ్గింది. అక్టోబర్‌లో పీఎంఐ 49.5కి పెరుగుతుందని అనలిస్టులు అంచనా వేయగా.. 48.7 కి తగ్గింది. ఇది సెప్టెంబర్‌లో 49.1 ఉంది.