అక్షరటుడే, న్యూఢిల్లీ: యూఎస్ ఫెడ్ ఛైర్మన్(US Fed chairman) చేసిన ఆశావాద కామెంటరీతో యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇతర గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గత సెషన్లో వాల్‌స్ట్రీట్(Wallstreet) లాభాలతో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు..
వడ్డీ రేట్ల(Rate cut)ను తగ్గించిన తర్వాత సుంకాల నుంచి వచ్చే ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుందన్న ఆశావాదాన్ని యూఎస్ ఫెడ్ చైర్మన్ పొవెల్ వ్యక్తం చేశారు. దీంతో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది. గత సెషన్లో ఎస్అండ్పీ 0.68 శాతం, నాస్డాక్(Nasdaq) 0.36 శాతం పెరిగాయి. ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం నష్టంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 0.14 శాతం లాభపడగా.. సీఏసీ 0.37 శాతం, డీఏఎక్స్(DAX) 0.13 శాతం నష్టపోయాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు..
గురువారం ఉదయం 8 గంటల సమయంలో ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.57 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.47 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.31 శాతం లాభాలతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 0.51 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.36 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.10 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.55 శాతం లాభంతో కొనసాగుతోంది. మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు నికరంగా రూ. 1,651 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు రూ. 3,752 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.86 నుంచి 0.73 కు తగ్గింది. విక్స్(VIX) 0.37 శాతం తగ్గి 10.91 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 62.50 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 89.98 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.14 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.22 వద్ద కొనసాగుతున్నాయి.