అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) నష్టాల బాటలో సాగుతున్నాయి. వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి.
ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ఉన్నాయి. కంపెనీల క్యూ3 ఫలితాల సీజన్‌కు ముందు వాల్‌స్ట్రీట్(Wallstreet) ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
దీంతో గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉంది. కోస్పీ మాత్రమే లాభాలతో సాగుతోంది.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు..
ఎస్‌అండ్‌పీ 0.28 శాతం, నాస్‌డాక్(Nasdaq) 0.08 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.15 శాతం లాభంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్‌టీఎస్‌ఈ 0.42 శాతం, సీఏసీ 0.23 శాతం నష్టంతో, డీఏఎక్స్(DAX) 0.06 శాతం, లాభాలతో ముగిశాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు..
శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.27 శాతం లాభంతో ఉండగా.. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫ్లాట్‌గా ఉంది.
జపాన్‌కు చెందిన నిక్కీ 0.97 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.84 శాతం, సింగపూర్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.23 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.16 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)లు మూడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,308 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. డీఐఐలు వరుసగా 32వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 864 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.80 నుంచి 1.06 కు పెరిగింది. విక్స్(VIX) 1.87 శాతం తగ్గి 10.12 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.32 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.78 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.14 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.33 వద్ద కొనసాగుతున్నాయి.
రష్యా(Russia), ఉక్రెయిన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. రష్యన్ దళాలు తమ దేశంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తున్నాయని, మధ్య కీవ్‌లోని ఎత్తైన అపార్ట్‌మెంట్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ పేర్కొంది.