Homeబిజినెస్​Pre Market Analysis | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre Market Analysis | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre Market Analysis | గ్లోబల్‌ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి ఉంది.. గిఫ్ట్‌ నిఫ్టీ సైతం నష్టాలతో ఉంది.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market Analysis | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) నష్టాల బాట పట్టాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) సైతం నష్టాలతో ఉంది.

యూఎస్‌, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) నష్టాలతో ముగిసింది. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం రెడ్‌లోనే ట్రేడ్‌ అవుతున్నాయి.

Pre Market Analysis | యూఎస్‌ మార్కెట్లు (US markets)..

గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.63 శాతం, నాస్‌డాక్‌(Nasdaq) 0.47 శాతం నష్టపోయాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.22 శాతం నష్టంతో ఉంది. టెస్లా(Tesla) స్టాక్‌ ధర 1.47 శాతం, ఆపిల్‌ 0.76 శాతం తగ్గాయి. ఎన్వీడియా షేరు ధర 1.10 శాతం పెరిగింది.

Pre Market Analysis | యూరోప్‌ మార్కెట్లు (European markets)..

సీఏసీ 1.36 శాతం, డీఏఎక్స్‌() 0.37 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.12 శాతం లాభపడ్డాయి.

Pre Market Analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..

ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) ఉదయం 8 గంటల సమయంలో నష్టాలతో సాగుతున్నాయి. సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ మాత్రమే 0.02 శాతం లాభాలతో ఉంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 1.45 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.04 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.87 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.84 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.52 శాతం నష్టంతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.13 శాతం నష్టంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు గత సెషన్‌లో నికరంగా రూ. 997 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. డీఐఐలు వరుసగా 37వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 4,076 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.21 నుంచి 1.38కు జంప్‌ అయ్యింది. విక్స్‌(VIX) 3.18 శాతం పెరిగి 10.87 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 60.80 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 26 పైసలు బలపడి 87.82 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.40 శాతం తగ్గి 3.96 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.15 శాతం తగ్గి 98.21 వద్ద కొనసాగుతున్నాయి.
  • రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ముగించే విషయంలో మరోసారి పుతిన్‌, ట్రంప్‌(Putin, Trump) సమావేశమవనున్నారు. రెండువారాల్లో వీరిద్దరు బుడాపెస్ట్‌లో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
  • క్రూడ్‌ ఆయిల్‌ ధర దిగి వస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడుతుండగా.. రూపాయి విలువ బలపడుతోంది.