అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | యూఎస్ మార్కెట్లు(US markets) రీబౌండ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్లు సైతం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాల బాటలో ఉన్నాయి.
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. డొనాల్డ్ ట్రంప్(Trump) రాజీ స్వరాన్ని వినిపించడంతో గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి.
యూరోపియన్ మార్కెట్లు(european markets) సైతం లాభాలతో ముగియగా.. ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌గా మారుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్పంగా పాజిటివ్‌గా ఉంది.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు (US markets)..
వాల్‌స్ట్రీట్ కోలుకుంది. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 2.21 శాతం, ఎస్‌అండ్‌పీ 1.56 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.26 శాతం లాభంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు (European markets)..
డీఏఎక్స్(DAX) 0.60 శాతం, సీఏసీ 0.20 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.16 శాతం లాభాలతో ముగిశాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..
మంగళవారం ఉదయం నిక్కీ(Nikkei), హాంగ్‌సెంగ్ మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.59 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.00 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.53 శాతం, సింగపూర్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.26 శాతం, లాభాలతో ఉనాయి.
జపాన్‌కు చెందిన నిక్కీ 0.94 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.09 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.06 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ టు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)లు నాలుగో సెషన్ తర్వాత నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 240 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. డీఐఐలు వరుసగా 34వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 2,333 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.32 నుంచి 1.05 కు పడిపోయింది. విక్స్(VIX) 8.96 శాతం పెరిగి 11.01 కు చేరింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.36 శాతం తగ్గి 63.55 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 3 పైసలు బలపడి 88.67 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.06 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.27 వద్ద కొనసాగుతున్నాయి.
- సెప్టెంబర్ నెలకు సంబంధించిన భారత సీపీఐ ద్రవ్యోల్బణం(CPI inflation) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. 1.54 శాతంగా నమోదయ్యింది. ఇది ఆగస్టులో 2.07 శాతంగా ఉంది.
- మధ్యప్రాచ్యంలో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇజ్రాయిల్, గాజా సీజ్‌ఫైర్‌లో భాగంగా హమాస్ బందీలను, ఇజ్రాయిల్ పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేశాయి.
- యూఎస్ అధ్యక్షుడు విధింంచిన అదనపు సుంకాల(Tariffs)పై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. యూఎస్ యాజమాన్యంలోని నౌకలపై ప్రత్యేక చార్జీలను వసూలు చేస్తోంది.