ePaper
More
    Homeబిజినెస్​Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

    Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pre market analysis | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిశ్రమంగా స్పందిస్తున్నాయి. శుక్రవారం యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు భారీ లాభాలతో ముగియగా.. సోమవారం(Monday) ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చివరి ట్రేడింగ్‌ సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌లో భారీ ర్యాలీ కనిపించింది. నాస్‌డాక్‌(Nasdaq) 1.51 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 1.47 శాతం మేర లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం సోమవారం 0.66 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో వాల్‌ స్ట్రీట్‌(Wall street) భారీ లాభాలతో ముగియడంతో ఏప్రిల్‌ 2 న రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ ప్రకటించిన తర్వాత వచ్చిన నష్టాలన్నీ కొట్టుకుపోయాయి.

    Pre market analysis | యూరోప్‌ మార్కెట్లలో భారీ ర్యాలీ..

    యూరోప్‌ మార్కెట్లు(Europe markets) భారీగా పెరిగాయి. గత ట్రేడింగ్‌ సెషన్‌లో డీఏఎక్స్‌ 2.55 శాతం, సీఏసీ 2.27 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 1,16 మేర లాభపడింది.

    Pre market analysis | నెగెటివ్‌గా ఆసియా మార్కెట్లు..

    వివిధ కారణాలతో జపాన్‌, చైనా(China), హాంగ్‌కాంగ్‌, సౌత్‌ కొరియాలలో సెలవు ఉండడంతో ఆయా దేశాల స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తెరచుకోలేదు. మిగిలిన ఆసియా మార్కెట్ల(Asia markets)లో మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 2.19 శాతం నష్టంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్స్‌ టైమ్స్‌(Straits times) 0.16 శాతం నష్టంతో కదలాడుతోంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.55 శాతం లాభంతో కొనసాగుతోంది. ఇది మన మార్కెట్లు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.

    Pre market analysis | గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లపై నమ్మకంతో ఉన్నారు. వరుసగా 12వ ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లోనూ వారు నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 2,769 కోట్ల స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐ(DII)లు రూ. 3,290 కోట్ల స్టాక్స్‌ కొన్నారు.
    • క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర మరింత దిగివచ్చింది. బ్యారెల్‌కు 3.37 శాతం తగ్గి 56.12 డాలర్ల వద్ద ఉంది.
    • రూపాయి విలువ 3 పైసలు తగ్గి 84.57 వద్ద నిలిచింది.
    • యూఎస్‌(US) డాలర్‌ ఇండెక్స్‌ 0.20 శాతం తగ్గి 99.66 వద్ద ఉంది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 0.14 శాతం తగ్గి 4.31 వద్ద కొనసాగుతోంది.
    • ఇండియా విక్స్‌(VIX) 0.19 శాతం మేర పెరిగి, 18.26కు చేరింది.
    • నిఫ్టీ పుట్‌ కాల్‌ రేషియో(PCR) 1.16 నుంచి 0.91 కు తగ్గింది. మన మార్కెట్లలో బుల్లిష్‌ సెంటిమెంట్‌ కాస్త తగ్గడాన్ని సూచిస్తోంది. 0.70 పైన ఉన్నంత వరకు బుల్స్‌దే ఆధిపత్యం.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...