అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : యూఎస్(US), యూరోప్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లూ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) సైతం పాజిటివ్‌గా ఉంది.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు (US markets)..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.98 శాతం, ఎస్‌అండ్‌పీ 0.83 శాతం పెరిగాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.06 శాతం సాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు (European markets)..
డీఏఎక్స్ 0.74 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.42 శాతం లాభంతో ముగియగా.. సీఏసీ 0.27 శాతం నష్టపోయింది.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు (Asian markets)..
ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.10 శాతం, నిక్కీ(Nikkei) 0.83 శాతం, హాంగ్‌సెంగ్ 0.54 శాతం, షాంఘై 0.28 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.20 శాతం, కోస్పీ 0.02 శాతం లాభాలతో ఉనాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.26 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్ అప్(Gap up)లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా తొమ్మిదోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడిరగ్ సెషన్‌లో నికరంగా రూ. 106 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు. డీఐఐలు ఎనిమిదో రోజూ నికరంగా రూ. 2,233 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో (PCR) 1.21 నుంచి 0.84 కు పడిపోయింది. విక్స్(VIX) 0.71 శాతం తగ్గి 10.85 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.27 శాతం తగ్గి 66.88 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.15 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.16 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.12 వద్ద కొనసాగుతున్నాయి.
- యూఎస్ మార్కెట్లు గురువారం ర్యాలీ తీశాయి. ఎస్‌అండ్‌పీ(S&P) ఆల్‌టైం హైలో ముగిసింది.
- ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నా.. గత సెషన్‌లో నామమాత్రంగా రూ.106 కోట్లు మాత్రమే అమ్మారు.
- జీఎస్టీ(GST) సంస్కరణలు వృద్ధికి ఊతం ఇస్తాయన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు క్రమంగా పైకి పెరుగుతాయన్న ఆశాభావాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.
యూఎస్, జపాన్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. జపనీస్ ఆటో ఉత్పత్తులపై సుంకాలు 15 శాతానికి తగ్గడంతో నిక్కీ ర్యాలీ తీసింది.