Homeతాజావార్తలుPre Market Analysis | యూఎస్‌లో షట్‌డౌన్‌కు ముగింపు.. పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు

Pre Market Analysis | యూఎస్‌లో షట్‌డౌన్‌కు ముగింపు.. పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు

Pre Market Analysis | గ్లోబల్‌ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు భారీగా లాభపడగా.. మంగళవారం ఉదయం చైనా, హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market Analysis | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు భారీగా లాభపడగా.. మంగళవారం ఉదయం చైనా, హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి.

Pre Market Analysis | యూఎస్‌ మార్కెట్లు US markets..

అమెరికా చరిత్రలో ప్రభుత్వ లాంగెస్ట్‌ షట్‌డౌన్‌(Longest Govt shut down)కు ముగింపు పలకడంతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) భారీగా లాభపడిరది. నాస్‌డాక్‌(Nasdaq) 2.29 శాతం, ఎస్‌అండ్‌పీ 1.54 శాతం పెరిగాయి. ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.14 శాతం లాభంతో ఉంది.

Pre Market Analysis | యూరోప్‌ మార్కెట్లు European markets..

డీఏఎక్స్‌(DAX) 1.63 శాతం, సీఏసీ 1.31 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 1.07 శాతం లాభపడ్డాయి.

Pre Market Analysis | ఆసియా మార్కెట్లు Asian markets..

ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) ఉదయం 8 గంటల సమయంలో ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ(KOSPI) 1.35 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్‌ టైమ్స్‌ 1.33 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.58 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.38 శాతం లాభాలతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.33 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.22 శాతం లాభంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 4,114 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా 12వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 5,805 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.93 నుంచి 0.99 కు పెరిగింది. విక్స్‌(VIX) 2.05 శాతం తగ్గి 12.30 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 63.91 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 88.69వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.12 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 99.66 వద్ద కొనసాగుతున్నాయి.
Must Read
Related News