అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | యూఎస్ ఫెడ్ మీటింగ్ (US Fed meeting) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో కనిపిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గత సెషన్లో వాల్‌స్ట్రీట్(Wallstreet)తోపాటు యూరోపియన్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు కూడా నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు..
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత(Rate cut)పై బుధవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగిసింది. గత సెషన్లో ఎస్అండ్పీ 0.35 శాతం, నాస్డాక్(Nasdaq) 0.25 శాతం నష్టపోయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం లాభంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.07 శాతం లాభపడగా.. ఎఫ్టీఎస్ఈ 0.23 శాతం, సీఏసీ 0.08 శాతం నష్టపోయాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.24 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.19 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ (Hang Seng) 0.77 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.48 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.14 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.28 శాతం నష్టంతో కొనసాగుతోంది. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు నికరంగా రూ. 655 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు రూ. 2,542 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.22 నుంచి 0.64 కు పడిపోయింది.
- విక్స్(VIX) 7.85 శాతం పెరిగి 11.13 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 62.46 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 9 పైసలు తగ్గి 90.08 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.17 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.05 వద్ద కొనసాగుతున్నాయి.