అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. వాల్‌స్ట్రీట్ నష్టాలతో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు లాభపడ్డాయి. ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ నష్టాలతోనే కనిపిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వారాంతంలో యూఎస్ ఆర్థిక డాటా విడుదల కానుంది. ఈ డాటా నెగెటివ్‌గా ఉండవచ్చన్న అంచనాలతో గత సెషన్లో వాల్‌స్ట్రీట్(Wallstreet) ఒత్తిడికి గురయ్యింది. టెక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో గత సెషన్లో నాస్డాక్(Nasdaq) 0.61 శాతం, ఎస్అండ్పీ 0.16 శాతం నష్టంతో ముగిశాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.06 శాతం లాభంతో ఉంది.
Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఎఫ్టీఎస్ఈ 1.05 శాతం, సీఏసీ 069 శాతం, డీఏఎక్స్(DAX) 0.18 శాతం లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల సమయంలో ప్రధాన ఆసియా మార్కెట్లు Markets నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.79 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ (HangSeng) 1.66 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.37 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.28 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.17 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.37 శాతం నష్టాలతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.22 శాతం నష్టంతో కొనసాగుతోంది. మన మార్కెట్లు గ్యాప్డౌన్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు నికరంగా రూ. 1,468 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు రూ. 1,792 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.15 నుంచి 1.18 కు పెరిగింది. విక్స్(VIX) 1.41 శాతం పెరిగి 10.25 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు బలహీనపడి 90.73 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.17 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్(Dollar index) 98.26 వద్ద కొనసాగుతున్నాయి.
- రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన అవకాశాలు బలపడుతున్నాయి. దీంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Crude oil) ధర 0.53 శాతం తగ్గి, బ్యారెల్‌కు 60.26 డాలర్ల వద్ద ఉంది.
- వారాంతంలో విడుదల కానున్న యూఎస్ ఆర్థిక డాటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండడంతో గ్లోబల్ మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి.