ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు ఎక్కువగా పాజిటివ్‌గా క్లోజ్‌ అవగా.. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాలతో కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతోంది. గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ Q2లో మంచి రిజల్ట్‌ ఇవ్వడంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టాక్స్‌ ర్యాలీ కొనసాగించాయి. దీంతో నాస్‌డాక్‌(Nasdaq) ఆల్‌టైమ్‌ రికార్డులు కొనసాగుతున్నాయి. ఆల్‌టైమ్‌ హై వద్ద సూచీలు ట్రేడ్‌ అవుతున్నాయి. గురువారం నాస్‌డాక్‌ 0.18 శాతం, ఎస్‌అండ్‌పీ 0.07 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.33 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.84 శాతం, డీఏఎక్స్‌ 0.23 శాతం పెరగ్గా.. సీఏసీ 0.41 శాతం నష్టపోయింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8.15 గంటల సమయంలో కోస్పీ(Kospi) 0.30 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.15 శాతం లాభంతో ఉన్నాయి. హంగ్‌సెంగ్‌ 0.80 శాతం, నిక్కీ 0.57 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.37 శాతం, షాంఘై 0.22 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.37 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో Trading సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. నికరంగా రూ. 2,133 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు వరుసగా 14వ ట్రేడిరగ్‌ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా కొనసాగారు. నికరంగా రూ. 2,617 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.14 నుంచి 0.9 కు పెరిగింది.
    • విక్స్‌(VIX) 1.97 శాతం పెరిగి 10.72కు చేరింది. ఇది గతేడాది ఏప్రిల్‌ 24 తర్వాత అత్యల్ప స్థాయి. విక్స్‌ తక్కువగా ఉండడం ఇన్వెస్టర్లలో భయలేమికి నిదర్శనం.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.5 శాతం పెరిగి 69.52 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.41 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.40 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 0.08 శాతం బలపడి 97.58 వద్ద కొనసాగుతున్నాయి.
    • వచ్చేవారంలో యూఎస్‌ ఫెడ్‌ సమావేశం ఉంది. వడ్డీరేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతుండడంతో యూఎస్‌ డాలర్‌ బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది.
    • నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్‌ 25,250 రెసిస్టెన్స్‌ను దాటలేకపోతోంది.
    • భారత్‌, యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం(FTA) కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 34 బిలియన్‌ డాలర్ల మేర పెంచడానికి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులు 99 శాతం టారిఫ్‌ ప్రయోజనాలను పొందుతాయని భావిస్తున్నారు.
    • రష్యా చాలా దేశాలకు గ్యాసోలిన్‌ ఎగుమతులను పరిమితం చేయాలని యోచిస్తుండడంతో ముడి చమురు ధరలు(Crude oil) పెరుగుతున్నాయి.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...