అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruthi), ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షకు వెళ్లకుండా పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుని ఆయా పోలీస్స్టేషన్లకు (Police station) తరలించారు.
నగరంలో బీఆర్ఎస్ (BRS) నాయకులు సత్యప్రకాశ్, సుజిత్ సింగ్ ఠాకూర్లను నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిర్పరాజు, అగ్గు సంతోష్, చింతకాయల రాజు, సదానంద్లను రెండో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్‌సెల్ కన్వీనర్ మధుసూదన్ రావు, కో-కన్వీనర్ పులి జైపాల్ మాట్లాడుతూ.. ప్రజాపాలన అంటూ రాష్ట్రంలో పోలీసు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.