Homeజిల్లాలునిజామాబాద్​PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ నాయకులను ముందస్తు అరెస్ట్​ చేశారు. నగరంలోని పీడీఎస్​యూ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం వారిని అరెస్ట్​ చేసి నాలుగో టౌన్​కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్​యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్​, జిల్లా నాయకులు నిఖిల్​ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

PDSU | వర్సిటీలో సమస్యలెన్నో..

తెయూ (Telangana University) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్నాతకోత్సవానికి (Graduation ceremony) యూనివర్సిటీ విద్యార్థులను పిలవకపోవడం విచారకరమని వారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వివరించేందుకు గవర్నర్​ను విన్నవించాలని భావించామన్నారు. తెయూలో ఇంజినీరింగ్ కోర్సులను తీసుకురావాలని, బాలికల హాస్టల్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు. నూతన యూజీసీ(UGC) ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్​ చేశారు.