Homeజిల్లాలునిజామాబాద్​Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలను తెలిపేందుకు ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (Mla Prashanth Reddy) క్యాంప్​ ఆఫీస్​కు వెళ్తున్నట్లుగా ముందస్తు సమాచారం మేరకు అంగన్​వాడీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఈ సందర్భంగా అంగన్​వాడీలు మాట్లాడుతూ.. ప్రీస్కూల్స్​ను (Pre school) అంగన్​వాడీలకు అప్పజెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం అంగన్​వాడీలను పక్కకు పెట్టి కొత్త పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదన్నారు.

తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. అరెస్టయిన వారిలో నియోజకవర్గంలోని అంగన్​వాడీ ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.

Must Read
Related News