అక్షరటుడే, ఇందూరు: STU Nizamabad | ప్రభుత్వం పీఆర్సీని (Pay Revision Commission) వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నగరంలోని ఎస్టీయూ భవన్లో (STU Bhavan) ఆదివారం సమావేశం నిర్వహించారు.
STU Nizamabad | వెంటనే డీఏ ఇవ్వాలి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పీఆర్సీ సమయం రెండేళ్లు పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన విధంగా ఈనెల నుంచి ఇస్తామన్న డీఏను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. డైట్, జూనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మహేశ్వర్, యాదగిరి, చంద్ర శేఖర్, రత్నాకర్, ప్రకాష్, సురేష్, సాయి తేజ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.