అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | భారత్- పాకిస్తాన్(India- Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత సైనికులకు(Indian Soldiers) ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని ఇందల్వాయిలో పూజలు చేశారు. శనివారం స్థానిక మల్లాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణ(Former Sarpanch Satyanarayana) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశం కోసం పోరాడుతున్న వీర సైనికులకు ఆత్మస్థైర్యాన్ని, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని వారు 108 ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
