అక్షరటుడే, ఆర్మూర్: Bjp Armoor | ఉగ్రవాదాన్ని(Terrorism) అంతం చేయడంలో సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని పట్టణంలో సోమవారం పలువురు ఆలయాల్లో పూజలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోని నాగలింగేశ్వర ఆలయం(Nagalingeshwara Temple)లో స్వామిని భక్తితో కొలిచారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, అంబిక రమేష్, రాజయ్య, అజయ్, నారాయణ, సర్వసమాజ్ మాజీ అధ్యక్షులు సడక్ మోహన్, సడక్ గంగాధర్, భక్తులు పుప్పాల రాజేందర్, కుకునూర్ లింగన్న, బోడమిది భోజన్న, భక్తులు పాల్గొన్నారు.
