అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanarayana Guptha | ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత త్రివిధ దళాలకు అంతా మంచి జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఇందుకోసం నగరంలోని కంఠేశ్వరాలయం(Kanteshwar Temple)లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత్ దాడులతో ఇప్పటికే దాయాది దేశానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. పహల్గామ్(Pahlgam) మృతులకు ఇది నిజమైన నివాళి అని తెలియజేశారు. దేశ ప్రధాని మోదీ సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Mla Dhanpal Suryanarayana Guptha | త్రివిధ దళాలకు మంచి జరగాలని పూజలు
Published on
