GOPA
GOPA | గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

అక్షరటుడే, ఇందూరు: GOPA | చదువులో ఉత్తమ ప్రతిభ చూపిన గౌడ విద్యార్థులకు ‘గోపా’ (Goud Officials & Professionals Association) ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్​ గౌడ్​ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన వాళ్లు, ఇంటర్​లో 900పైగా మార్కులు సాధించిన విద్యార్థులు పురస్కారాలకు అర్హులని వివరించారు.

ఈనెల 15న నగరంలోని అంబేడ్కర్​ భవన్​లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు తమ మార్కుల మెమో, ఆధార్​కార్డు, జిరాక్స్​ కాపీలను నిజామాబాద్​లో ఎం.వెంకటేశ్వర్ గౌడ్ (9440768910), రవీందర్ గౌడ్ (9866413250), టి.సోమలింగం గౌడ్ (9440502363), హెచ్.లక్ష్మణ్ గౌడ్ (8341631163), ఆర్మూర్​లో లింబాగౌడ్ టీచర్ (9491313699), రాజేశ్వర్ గౌడ్ (9912469820)లను వాట్సప్​లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమానికి పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​గౌడ్​, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారయ్య గౌడ్​, చక్రవర్తి గౌడ్​ హాజరవుతారని పేర్కొన్నారు.