అక్షరటుడే, వెబ్డెస్క్: Prathyusha Death Case Verdict | తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు చెప్పింది. నిందితుడు సిద్దార్థ రెడ్డికి షాక్ ఇచ్చింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది.
తెలుగు నటి ప్రత్యూష 2002లో చనిపోయారు. ఫిబ్రవరి 23న ప్రత్యూష, ఆమె ప్రియుడు పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రత్యూషను హత్య చేశారని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన ఈ కేసులో పలువురు రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం కేసును సీబీఐ (CBI)కి అప్పగించింది. రెండు దశాబ్దాలుగా కేసు విచారణ సాగుతోంది.
Prathyusha Death Case Verdict | బెయిల్ పిటిషన్ కొట్టివేత
ప్రత్యూష స్నేహితుడు సిద్దార్థ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ గతంలో ఛార్జీషీట్ దాఖలు చేసింది. దీంతో నాంపల్లి కోర్టు (Nampally Court) అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. నాంపల్లి కోర్టు తీర్పును హైకోర్టు (High Court)లో నిందితుడు సవాల్ చేశారు. కోర్టు అతడి శిక్షను రెండున్నరేళ్లకు కుదించింది. అయితే ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సిద్ధార్థరెడ్డికి జీవిత ఖైదు విధించాలని ప్రత్యూష తల్లి ఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ధర్మాసనం సమర్థించింది.