ePaper
More
    HomeజాతీయంPrashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(Chief Minister Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఓ టీవీ ఛానెల్​లో మాట్లాడుతూ.. రేవంత్​రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) ముందు అప్పటి సీఎం కేసీఆర్​పై రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో భాగంగా పలు విషయాల్లో ఆయనను విమర్శించారు. అయితే ఆ సమయంలో కేసీఆర్​ కీలకమైన బాధ్యతల్లో బీహార్​కు చెందిన ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులను నియమించారు. దీనిపై రేవంత్​రెడ్డి బీహారీ బ్యాచ్(Bihari Batch)​ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు రేవంత్​ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అంతేగాకుండా కేసీఆర్​ డీఎన్​ఏ బీహర్​ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రశాంత్​ కిశోర్(Prashant Kishore)​ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

    Prashanth Kishor | రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలి

    కాంగ్రెస్​ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీహారీలపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్​ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ కిశోర్​ డిమాండ్​ చేశారు. ఈ ఏడాది అక్టోబర్​, నవంబర్​లో బీహార్​లో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాగైన పట్టు సాధించాలని జన్​ సురాజ్​ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం నితీశ్​కుమార్​(CM Nitish Kumar) తీరుపై పలు ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు. బిహార్‌ గ్రామంలో ఓ రాత్రి అయినా గడపాలని..రాహుల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ సవాల్​ విసిరారు. బిహార్ ప్రజలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఖండించిన పీకే.. ఆ వ్యాఖ్యలకు రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. తర్వాతే ఆయన బీహార్​లో అడుగు పెట్టాలన్నారు.

    More like this

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...