HomeజాతీయంBihar Elections | ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రశాంత్​ కిశోర్​ కీలక ప్రకటన

Bihar Elections | ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రశాంత్​ కిశోర్​ కీలక ప్రకటన

Bihar Elections | బీహార్​ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జన్​ సురాజ్​ పార్టీ అధినేత ప్రశాంత్​ కిశోర్​ తెలిపారు. పార్టీ గెలుపు కోసం తాను పని చేస్తానని స్పష్టం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్​లో ఎన్నికలు (Bihar Elections)సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని ఎన్డీఏ భావిస్తుండగా.. బీహార్​లో గెలిచి సత్తా చాటాలని ఇండి కూటమి భావిస్తోంది. మరోవైపు బీహార్​లో అధికారం సాధించడమే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసిన ప్రశాంత్​ కిశోర్​ కీలక ప్రకటన చేశారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ జన్ సురాజ్ పార్టీని (Jan Suraj Party) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన కొంతకాలంగా చెబుతున్నారు. ఈ మేరకు ప్రచారంలో సైతం దూసుకు పోతున్నారు. తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన గతంలో పేర్కొన్నారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections)తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. వ్యక్తిగతంగా తాను బరిలో నిలవకున్నా.. పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.

Bihar Elections | పార్టీ ప్రయోజనాల కోసం..

ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని ప్రశాంత్​ కిశోర్​ (Prashanth Kishore)అన్నారు. రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసమే తాను పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. తాను పోటీ చేస్తే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. బీహార్​లో 150 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Bihar Elections | నితీశ్​కుమార్​పై విమర్శలు

సీఎం నితీశ్​కుమార్ (CM Nitish Kumar)​పై ప్రశాంత్​కిశోర్​ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మళ్లీ సీఎం కాలేరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు 25 సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్​, ఆర్జేడీ మధ్య విభేదాలు ఉన్నాయని ఆయన అన్నారు. తాము గెలిస్తే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.