Homeజిల్లాలుకామారెడ్డిPalle Prakruthi Vanam | ప్రకృతి వనం.. ఆహ్లాదానికి దూరం..

Palle Prakruthi Vanam | ప్రకృతి వనం.. ఆహ్లాదానికి దూరం..

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్:Palle Prakruthi Vanam | మండలంలోని గోర్గల్ గ్రామం(Gorgal Village)లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం(Rural Nature Forest)పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా నర్సరీ(Nursery)లో ఉన్న సుమారు 20 వరకు కొబ్బరిచెట్లు ఎండిపోయాయి. వాటిలో కొన్ని కొబ్బరి చెట్లు పూర్తిగా ఎండిపోయి కిందపడ్డాయి. రూ. వేల్లలో ప్రజాధనాన్ని ఖర్చుచేసి గతేడాది ప్రకృతి వనం చుట్టూ కొబ్బరిచెట్లు నాటారు. కాని వాటి సంరక్షణను గాలికొదిలేయడంతో చెట్లన్ని మొడువారాయి. వెంటనే నర్సరీల్లో ఇతర మొక్కలను కాపాడేందుకు వన సంరక్షులను నియమించి విలువైన మొక్కలను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.