7
అక్షరటుడే, ఇందూరు: Prajavani cancel | ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T.Vinay Krishna Reddy) శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ (election process) ముగిసిన అనంతరం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.