Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | కలెక్టరేట్​లో ప్రజావాణి.. ఫిర్యాదులు అందజేసిన బాధితులు

Prajavani | కలెక్టరేట్​లో ప్రజావాణి.. ఫిర్యాదులు అందజేసిన బాధితులు

జిల్లా కలెక్టరేట్​లో సోమవార్ ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తదితర అధికారులు వినతులు స్వీకరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Prajavani | జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. అనంతరం పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Prajavani | ఫైనాన్స్​ వేధింపులు తట్టుకోలేకపోతున్నాం..

ప్రైవేటు ఫైనాన్స్​లో (Private Finance) తాము రుణం తీసుకున్నామని అనివార్య కారణాలతో కట్టలేకపోయామని ఎడపల్లి మండలం (Edapalli Mandal) సిర్నాపల్లి గ్రామానికి చెందిన విమల రాజేశ్వర్ దంపతులు తెలిపారు. జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము కూలిపని చేసి జీవితం వెల్లదీస్తున్నామన్నారు. అనివార్య కారణాలతో నెలవారి ఈఎంఐ (EMI) చెల్లించలేక పోయామన్నారు. దీంతో ప్రైవేట్ ఫైనాన్స్​ కంపెనీ తమను వేధిస్తోందన్నారు. దయచేసి తమకు సమయం ఇవ్వాలని, సమస్యను పరిష్కరించాలని వారు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Prajavani | ఫించన్ ఇప్పించండి సారూ..

పుట్టినప్పటినుంచి అంగవైకల్యంతో బాధపడుతున్న తమ కూతురు ఆధ్యకు పింఛన్ ఇప్పించాలని మోర్తాడ్​కు చెందిన కృష్ణ అంజలి దంపతులు కోరారు. ఈమేరకు ప్రజావాణిలో (Prajavani) వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము దినసరి కూలీలమని తమకు ముగ్గురు కూతుర్లు ఉన్నారన్నారు. ఆధ్య చికిత్స నిమిత్తం అనేక ఆస్పత్రుల్లో చూపించామని వాపోయారు. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పింఛన్​ ఇప్పించాలని కోరారు.

Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనివ్వాలి..

ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్​తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డీపీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్​లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

అనంతరం మహిళా, శిశు, వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Must Read
Related News