Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | యథావిధిగా ప్రజావాణి

Prajavani | యథావిధిగా ప్రజావాణి

‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి తిరిగి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికలు వాయిదా పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని (Prajavani program) తిరిగి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్​ శనివారం ప్రకటన విడుదల చేశారు.

ఈనెల 13వ తేదీ నుండి జరుగబోయే ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలన్నారు.