అక్షరటుడే, ఎల్లారెడ్డి: Jukkal MLA | ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantarao) తెలిపారు. జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ (Praja Darbar) నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం అధికారులకు నివేదించారు.
Jukkal MLA | గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం..
గత ప్రభుత్వ హయాంలో ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం (negligence) విపరీతంగా ఉండేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కానీ తాను ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
