HomeUncategorizedActress Pragati | 50 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఉడుం ప‌ట్టు.. న‌టి ప్ర‌గ‌తికి గోల్డ్ మెడ‌ల్‌తో...

Actress Pragati | 50 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఉడుం ప‌ట్టు.. న‌టి ప్ర‌గ‌తికి గోల్డ్ మెడ‌ల్‌తో పాటు మ‌రో రెండు మెడ‌ల్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Actress Pragati | తెలుగు ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ చిత్రాల్లో తల్లి పాత్రలతో తనదైన ముద్ర వేసిన ఈ నటి, ప్రస్తుతం సినిమాలలో తక్కువగా కనిపించినా, సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో నిత్యం ట‌చ్‌లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రగతి ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్​గా (Professional Powerlifter) మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

నటిగా తన సత్తా చాటిన ఆమె, ఇప్పుడు క్రీడా రంగంలోనూ అద్భుతమైన విజయాలతో ముందుకెళ్తున్నారు. 2024లో సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఆమె, తాజాగా కేరళలో నిర్వహించిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ (National Masters Classic) పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో గోల్డ్ మెడల్ (Gold Medal) గెలుచుకున్నారు. అంతేకాదు, మరో రెండు విభాగాల్లోనూ మెడల్స్ సాధించారు.

Actress Pragati | గొప్ప ఘ‌న‌త‌

స్క్వాట్: 115 కిలోలు, బెంచ్ ప్రెస్: 50 కిలోలు,డెడ్ లిఫ్ట్: 122.5 కిలోలు.. ఈ మూడు విభాగాల్లో అత్యుత్త‌మ‌ ప్రదర్శనతో మొత్తం మూడు మెడల్స్ సాధించగా, అందులో ఒకటి గోల్డ్. ఈ ఘనతపై నటి ప్రగతి (Actress Pragati) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అభిరుచి, క్రమశిక్షణ, కృషి ఉంటే ఏదైన సాధించ‌వ‌చ్చు. నా ప్రియమైన వారందరికీ టన్నుల కొద్దీ ప్రేమ తప్ప మరేమీ ఇవ్వ‌లేను. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా కోచ్ @mr._uday_katకి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. 50 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో ఫిట్‌నెస్, డెడికేషన్ చూపిస్తూ యువతకు ఆదర్శంగా మారుతున్న ప్రగతి జోష్‌ని చూసి అభిమానులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Real Power Woman!”, “Age is just a number!” అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సినీ రంగంలో ఎన్నో పాత్రల ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్న ప్రగతి, ఇప్పుడు క్రీడా రంగంలోనూ (Sports Field) అదే స్థాయిలో అభినందనలు అందుకుంటున్నారు. ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తోంది. మీ అభిరుచి ఏమైనా కావచ్చు.. కానీ కృషి, పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా సాధించగలమనే జీవిత సత్యాన్ని నటి ప్రగతి మరోసారి నిరూపించారు. ఈ మధ్య ప్ర‌గ‌తి సినిమాల‌లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

Must Read
Related News