ePaper
More
    Homeభక్తిShiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    Shiva Worship | పాపాలను హరించే ప్రదోష పూజ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shiva Worship | హిందూ ధర్మం (Hindu Dharma) ప్రకారం శివారాధనకు ప్రదోష(Pradosha) సమయం అత్యంత అనుకూలం. ఆ సమయంలో శివపూజ చేసినా, శివపంచాక్షరి ధ్యానం చేసినా విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో అసలు ప్రదోషం అంటే ఏమిటి? ఎన్ని రకాల ప్రదోషాలుంటాయి? ఆ సమయంలో ఏం చేయాలన్న విషయమై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రుద్రమణి శివాచార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

    Shiva Worship | ప్రదోష కాలం అంటే..

    ప్రదోష అంటే రాత్రి కాలం అని అర్థం. సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఉండే సమయం.. స్పష్టంగా చెప్పాలంటే సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు.. అంటే మొత్తం 48 నిమిషాలను ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో శివుడిని పూజించినా, శివ పంచాక్షరి (shariShiva Panchakshari) ధ్యానం చేసినా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రదోష కాల పూజ చేస్తే శివుడిని మాత్రమే కాదు.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.

    Shiva Worship | ప్రదోష కాలం రకాలు..

    ప్రదోష కాలం రోజూ ఉంటుంది. ఇది నిత్య ప్రదోషకాలం. కృష్ణపక్ష (Krishna Paksham) త్రయోదశిని పక్ష ప్రదోషం అని, శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషం అని అంటారు. శనివారం.. శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మహా ప్రదోషంగా పేర్కొంటారు. దీన్నే శని మహాప్రదోషం అని కూడా పిలుస్తారు. దేవతలు పాల కడలిని చిలికినప్పుడు వెలికి వచ్చిన విషాన్ని శివుడు స్వీకరించి లోకాన్ని సంరక్షించిన రోజును శని ప్రదోషంగా పిలుస్తారు. శనివారం వచ్చే ప్రదోషం రోజున ఉపవాసం ఉండి శివార్చన చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. బుధవారాన్ని(Wednesday) సౌమ్య వారమని అంటారు. మహాప్రదోషం బుధవారం వస్తే ఆ రోజును సౌమ్య ప్రదోషంగా వ్యవహరిస్తారు.

    Shiva Worship | ప్రదోష పూజ ఫలితాలు..

    పరమశివుడు (Parama Shiva) ప్రమథ గణాలతో కొలువయ్యుండే ప్రదోష కాలంలో ఆయనను స్మరిస్తే మన పాప కర్మల ఫలాన్ని తాను స్వీకరించి కష్టాలను తొలగిస్తాడనేది భక్తుల నమ్మకం.

    ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని, ఆ సమయంలో ఆ మహేశ్వరుడిని పూజించడం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. గత జన్మలలో చేసిన పాపాలు కూడా ప్రదోషకాల పూజతో (Pradosha Puja) తొలగిపోతాయి. ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.

    నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నందీశ్వరుడిని ప్రదోష కాలంలో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అన్ని చదువులున్నా నందీశ్వరుడు వినయంతో వుంటాడని, శివునికి ఏర్పడిన అనుమానాలనూ నివృత్తి చేస్తాడని నమ్ముతారు. ప్రదోషకాల పూజలో పాల్గొంటే బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం దక్కుతాయి.ప్రదోష కాలంలో ఆవు పాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖు పూలను సమర్పించుకుని స్తుతిస్తే కోరికలు నెరవేరుతాయి.

    శివ మహా పురాణం(Shiva Maha Puranam) ప్రకారం సౌమ్య ప్రదోషం రోజు శివపార్వతులను పూజించడం వల్ల మన మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం. పరమేశ్వరుడి పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను (Shiva and Parvathi) పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. సౌమ్య ప్రదోషం రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్ర వచనం.

    Shiva Worship | ప్రదోష పూజా విధి..

    సౌమ్య ప్రదోష వ్రతం చేసుకునే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానాదులు పూర్తి చేసి శివ పార్వతులను మల్లెలతో పూజించాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి, శివాష్టకం పఠించాలి. సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు చేయాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమి ఆకులు వంటివి శివునికి సమర్పించి, హారతి ఇవ్వాలి. ప్రదోష వ్రతం కథ చదివినా, విన్నా విశేష ఫలితం ఉంటుంది. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాస దీక్ష విరమించాలి.

    Shiva Worship | ప్రదోష వ్రత కథ

    పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ భర్త చనిపోవడం వల్ల కష్టపడి సంతానాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు బయటకి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమెకు గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపించాడు. ఆమె దయతో అతడిని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేసింది. తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాకుమారుడని తెలుసుకుంటుంది. శత్రు సైనికులు అతడి రాజ్యం మీద దాడి చేసి, అతడి తండ్రిని బందీగా చేసుకుని రాజ్యాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడే నివసించసాగాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ కుమారి యువరాజును చూసి ముగ్ధురాలు అవుతుంది. మరుసటి రోజు అన్షుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజును కలుస్తుంది. కొన్ని రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు.

    ఆ బ్రాహ్మణ స్త్రీ (Brahmin woman) పరమశివుడి భక్తురాలు. ప్రదోష వ్రతం తప్పనిసరిగా పాటించేది. ఆమె ప్రదోష వ్రత ఫలితం వల్ల అన్షుమతి తండ్రి అయిన గంధర్వ రాజు తన సైన్యంతో కలిసి విదర్భ మీద దాడి చేసి విజయం సాధిస్తాడు. శత్రువులను తరిమేసి యువరాజు తండ్రిని కూడా బంధవిముక్తుడిని చేస్తాడు. అందుకే ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు. యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందడంతో పాటు తన తండ్రిని కూడా శత్రు రాజుల నుంచి విడిపించాడు. అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది.

    Latest articles

    Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం...

    Bengaluru | చెప్పులో దూరిన పాము.. కాలుకి స్ప‌ర్శ లేక‌పోవ‌డంతో టెక్కీ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengaluru | బెంగళూరులోని బన్నేరుఘట్టలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software...

    Gama Awards 2025 | దుబాయ్‌లో గ్రాండ్‌గా గామా అవార్డ్స్ 2025 .. మ‌రో అవార్డ్ త‌న ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gama Awards 2025 | దుబాయ్ షార్జా ఎక్స్‌పో సెంటర్ వేదికగా ఆగస్ట్ 30న...

    SRSP | శాంతించిన గోదావరి.. శ్రీరామ్​సాగర్​కు తగ్గిన వరద

    అక్షరటుడే, ఆర్మూర్​ : SRSP | ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరి (Godavari) శాంతించింది. దీంతో శ్రీరామ్​ సాగర్...

    More like this

    Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం...

    Bengaluru | చెప్పులో దూరిన పాము.. కాలుకి స్ప‌ర్శ లేక‌పోవ‌డంతో టెక్కీ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengaluru | బెంగళూరులోని బన్నేరుఘట్టలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software...

    Gama Awards 2025 | దుబాయ్‌లో గ్రాండ్‌గా గామా అవార్డ్స్ 2025 .. మ‌రో అవార్డ్ త‌న ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gama Awards 2025 | దుబాయ్ షార్జా ఎక్స్‌పో సెంటర్ వేదికగా ఆగస్ట్ 30న...