అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకున్నప్పుడే భవిష్యత్తులో రాణిస్తారని భీమ్‌గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల (Government Junior College) ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి అన్నారు. భీమ్‌గల్ పట్టణంలోని ఓం ఎంటర్ప్రైజెస్ ఓజేటి (On-the-Job Training) సెంటర్‌ను మంగళవారం సందర్శించారు. ఒకేషనల్ విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు.
Bheemgal Mandal | ఉపాధి అవకాశాలు ఎక్కువ..
శిక్షణలో భాగంగా ఫస్ట్, సెకండ్ ఒకేషనల్ విద్యార్థులు (vocational students) నిర్వహిస్తున్న ప్రయోగ వివరాలను ప్రిన్సిపాల్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లెక్కలను ఏవిధంగా నమోదు చేస్తున్నారు.. చేసిన అకౌంట్స్‌ను వివరాలను పరిశీలించారు. కంప్యూటర్లలో బిల్లుల తయారీ విధానం తదితర అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఒకేషనల్ కోర్సుల ద్వారా విద్యార్థులకు స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.
Bheemgal Mandal | వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పాటు..
ప్రస్తుతం నేర్చుకుంటున్న ఈ ప్రాక్టికల్ అంశాలు వారి వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని ప్రిన్సిపాల్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు క్రాంతి కృష్ణ, రాంచందర్, ఓం ఎంటర్ ప్రైజెస్ మేనేజ్మెంట్ ప్రతినిధులు సురేందర్, శ్వేత విద్యార్థులు పాల్గొన్నారు.