HomeUncategorizedSpirit Movie Heroine | దీపిక గొంతెమ్మ కోరిక‌ల‌కు మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌ని ప‌ట్టుకొచ్చిన సందీప్.....

Spirit Movie Heroine | దీపిక గొంతెమ్మ కోరిక‌ల‌కు మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌ని ప‌ట్టుకొచ్చిన సందీప్.. స్పిరిట్ హీరోయిన్ ఎవ‌రంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Spirit Movie Heroine | ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పిరిట్ చిత్రం (Spirit Movie) ఒక‌టి. ఈ సినిమాపై అభిమానుల‌లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ‘స్పిరిట్ Spirit చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan india Star Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో తెరకెక్కనుంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నాడు సందీప్. హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను (Bollywood actress Deepika Padukone) ఎంపిక చేసిన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.

Spirit Movie Heroine | క్లారిటీ వ‌చ్చేసింది..

అయితే దీపిక Deepika కండీష‌న్స్‌కి బాగా హ‌ర్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త హీరోయిన్‌ని వెతికాడు. స్పిరిట్ కోసం దీపికా భారీ పారితోషికంతో పాటు, పెద్ద మొత్తంలో షేర్​ను డిమాండ్ చేసిందని, పైగా 8 గంటలు మాత్ర‌మే ప‌నికి కేటాయిస్తాన‌ని కండీష‌న్స్ కూడా పెట్టింద‌ని స‌మాచారం. అయితే ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ఇచ్చిన ఎనిమిది గంట‌ల‌లో రెండు గంట‌లు జర్నీకే స‌రిపోతే మిగిలిన ఆరు గంట‌లు మాత్ర‌మే సెట్స్‌లో ఉంటుంది అనే కండీష‌న్స్ (Conditions) పెట్టింద‌ట‌. దీంతో సందీప్​రెడ్డి చిత్రంలో న‌టించ‌నున్న‌ హీరోయిన్​ పేరును ఆయనే స్వయంగా ప్రకటించారు.​ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్​లో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Bollywood beauty Tripti Dimri) హీరోయిన్​గా నటించనున్నట్లు సందీప్‌ శనివారం ప్రకటించారు.

దీంతో డార్లింగ్ ఫ్యాన్స్​కు హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాలో నటించనున్న పలువురు నటీనటుల వివరాలు త్వరలోనే బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమా దాదాపు 9 భాషల్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు తాజా ప్రకటన చూస్తే అర్థమవుతోంది. త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) పేరును తెలుగుతో పాటు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ రాశారు. కాగా, స్పిరిట్ కోసం దీపిక స్థానంలో కియారా అద్వానీ, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు పరిశీలిస్తున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌చారాలు న‌డిచాయి. దీంతో అన్నింటికి చెక్ ప‌డ్డ‌ట్టు అయింది.

Must Read
Related News