అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prabhas Spirit First look : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, భారతీయ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్ Prabhas కథానాయకుడిగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి వరుస బ్లాక్బస్టర్ల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా ‘స్పిరిట్’లో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇటీవల ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ పోనీటైల్ (పిలక) లుక్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ షూటింగ్ నుంచి వచ్చానని చెప్పడంతో ఆ ఉత్సుకత మరింత పెరిగింది. ఇప్పుడు ఆ లుక్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
కేక పెట్టిస్తున్న ప్రభాస్..
న్యూ ఇయర్ సందర్భంగా ‘స్పిరిట్’ Spirit ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్‌లో హీరో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ తృప్తి డిమ్రి కూడా కనిపించడం విశేషం. పోస్టర్‌ను ఒక్కసారి చూసిన వెంటనే ఇది పూర్తిగా వంగా స్టైల్లో రూపొందిన సినిమా అనే భావన కలుగుతుంది.
ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఓ చేతిలో మందు బాటిల్ పట్టుకొని, నోటిలో సిగరెట్ పెట్టుకొని కనిపిస్తారు. ఆ సిగరెట్‌ను హీరోయిన్ తృప్తి డిమ్రి వెలిగిస్తూ కనిపించడం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ టోన్‌ను ఇచ్చింది. హీరో బ్యాక్‌పై మూడు బ్యాండేజీలు స్పష్టంగా కనిపించగా.. అవి సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత రఫ్ అండ్ టఫ్‌గా ఉండబోతుందో సూచిస్తున్నాయి. ఈ లుక్‌తోనే ప్రభాస్ క్యారెక్టర్ గ్రే షేడ్స్‌తో, పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందన్న సంకేతాలు ఇచ్చారు మేకర్స్.
నవంబర్ 23, 2025న పూజా కార్యక్రమాలతో ‘స్పిరిట్’ అధికారికంగా ప్రారంభమైంది. ఆ ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ప్రత్యేక అతిథిగా హాజరుకావడం సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచింది. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రభాస్, తృప్తి డిమ్రి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి కాంచన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.‘స్పిరిట్’ను పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నామని, తొమ్మిది భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని దర్శక, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.