అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prabhas | ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ ప్రభాస్ (Prabhas) గురించి తెలిసిన వారికి ఆయన అతిథి సత్కారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను ఒకసారి కలిసే అదృష్టం దక్కిన వారంతా, ఆయన ఇంటి వంటకాలను (home cooking) రుచి చూడకుండా వెళ్లరు.
ఇప్పుడు ఆ ప్రత్యేక జాబితాలోకి ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న నూతన హీరోయిన్ ఇమాన్వి (Imanvi) కొత్త పేరు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న “ఫౌజీ” సినిమా (Fauji Movie) షూటింగ్‌లో ఇమాన్వి బిజీగా ఉంది. షూట్ మధ్యలో ప్రభాస్ తన ఇంట్లో వండిన రుచికరమైన ఆహారాన్ని ఆమెకు పంపారట. ఆ వంటకాల వైవిధ్యాన్ని చూసి ఇమాన్వి ఆశ్చర్యపోయింది.
Prabhas | ఆతిథ్యానికి ఫిదా..
ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఆ ఫుడ్ ఫొటోను షేర్ చేస్తూ.. “Heart and stomach so so full. Thank you Prabhas garu” అని రాసి ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ చిన్న ఘటనతో మరోసారి ప్రభాస్ ఎంత సాఫ్ట్ హార్ట్ పర్సన్, అతిథి సత్కారంలో ముందుండే వ్యక్తి అనేది స్పష్టమైంది. గతంలో కూడా ఆయన సహనటులు సింప్లిసిటీ, మానవత్వం గురించి ప్రశంసలు కురిపించారు.
ఇక దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వం వహిస్తున్న “ఫౌజీ” ఒక పీరియడ్ వార్ & లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫౌజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రభాస్ ఓ యోధుడి లుక్‌లో ఆకట్టుకున్నాడు. పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్.. “The battalion who fights alone” సినిమాపై ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. సినిమా 2026 ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో విడుదలయ్యే అవకాశముంది. ఇటీవల ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఆయన “కన్నప్ప” సినిమాలో స్పెషల్ కెమియో చేశారు. “మిరాయ్” చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 9న ఆయన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “ది రాజా సాబ్” విడుదల కానుంది. అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న “స్పిరిట్”లో కూడా ప్రభాస్ కనిపించనున్నారు.
