అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prabhas Fauji Injury | రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) తాజాగా తన కొత్త చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. హార్స్ రైడ్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గుర్రం అదుపు తప్పడంతో ప్రభాస్ కిందపడడం జరిగింది. దీంతో చిన్నపాటి గాయాలు అయినప్పటికీ, అవి తీవ్రమైనవి కాదని, ముందుస్తు జాగ్రత్తగా ఆ రోజు షూటింగ్‌కు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియా (Social Media)లో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా హను రాఘవపూడి (Director Hanu Raghavapudi) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. యూనిట్ సభ్యులు మాత్రం ప్రభాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సూచనల మేరకు స్వల్ప విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన తిరిగి సెట్స్‌లోకి రానున్నట్లు సమాచారం.
Prabhas Fauji Injury | సైనికుడి పాత్రలో..
హను రాఘవపూడి గతంలో రూపొందించిన సీతారామం చిత్రం (Seetharam Movie) ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అదే స్థాయి నిబద్ధతతో ‘ఫౌజీ’ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారని, ఆ పాత్ర ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ వాతావరణం, గుర్రపు స్వారీలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ప్రభాస్ తన భవిష్యత్ ప్రాజెక్టుల్లో డబుల్ రోల్లో కనిపించే అవకాశముందని, అది ‘ఫౌజీ’లోనే ఉండొచ్చని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు.
అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కల్కి 2898 ఏడీ 2898 AD సీక్వెల్‌కు భిన్నంగా ‘ఫౌజీ’ పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘రాజాసాబ్’ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు ‘ఫౌజీ’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో షూటింగ్లో పాల్గొనాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.