అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hero Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చాలా కాలం తర్వాత తన అభిమానులను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. ఆయన కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభాస్, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మైక్ పట్టి అభిమానులను “డార్లింగ్స్, ఎలా ఉన్నారు?” అంటూ పలకరించడంతో ప్రాంగణం మొత్తం హోరెత్తిపోయింది. ఆయన ప్రసంగం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, 2026 సంక్రాంతికి విడుదల కానున్న అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి. అన్నీ విజయవంతం కావాలని మరోసారి కోరుకుంటున్నాను. మాది కూడా హిట్టయిపోతే హ్యాపీ” అంటూ వినమ్రంగా స్పందించారు.
Hero Prabhas | దటీజ్ ప్రభాస్..
సీనియర్ నటులపై ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు అందరి మనసులు గెలుచుకున్నాయి. సీనియర్స్ అంటే సీనియర్సే. వాళ్ల నుంచి చాలా నేర్చుకుంటాం. సీనియర్స్ తర్వాతే మేము” అంటూ తన తరం విజయాల వెనుక పెద్దల అనుభవమే కారణమని పేర్కొన్నారు. ఈ సినిమాను నిర్మించిన టీజీ విశ్వప్రసాద్‌పై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా విశ్వప్రసాద్ గారు కాక ఇంకెవరైనా నిర్మించి ఉంటే పూర్తయ్యేదే కాదు. ఆయనే ఈ సినిమాకు అసలైన హీరో” అని అన్నారు. అంతేకాదు, సరదాగా మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఏం తిని పెరిగారు? ఆ తినేదేదో మాకు కూడా చెప్పండి” అంటూ నవ్వులు పూయించారు. ఇక ఈవెంట్లో దర్శకుడు మారుతి (Director Maruthi) తన ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది గమనించిన ప్రభాస్ వెంటనే స్టేజ్‌పైకి వెళ్లి మారుతిని ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఈ దృశ్యం అక్కడున్న ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది.
ట్రైలర్ గురించి మాట్లాడిన ప్రభాస్, రేపు ట్రైలర్ Trailer చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఆయన అభిరుచి అన్నీ అందులో కనిపిస్తాయి” అంటూ ఆసక్తిని మరింత పెంచారు. చివరగా తన ప్రత్యేక శైలిలో “సో, లవ్ యు డార్లింగ్! ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడానా? అప్పుడప్పుడు అలా వస్తుంటుంది. ఓకే డార్లింగ్!” అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రభాస్ సుదీర్ఘంగా మాట్లాడటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.