అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు (Prabhakar) విచారణ రెండో రోజు ముగిసింది. బుధవారం సిట్ అధికారులు ఆయనను తొమ్మిది గంటల పాటు విచారించారు. ఈ నెల 9న తొలిసారి ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు కూడా అధికారులు దాదాపు 8 గంటల పాటు ఆయనను విచారించారు. అయితే ఆయన తనకు సంబంధం లేని విషయాలు అడగొద్దు అంటున్నట్లు సమాచారం. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని వాదించినట్లు తెలిసింది. ఈ నెల 14న మళ్లీ విచారణకు హాజరుకావాలని సిట్(SIT) ఆదేశించింది.
Phone Tapping Case | వారి స్టేట్‌మెంట్లు ముందు పెట్టి..
ప్రభాకరరావును సిట్ అధికారులు ప్రధానంగా హార్డ్ డిస్క్‌ల ధ్వంసంపై విచారించారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్‌మెంట్లు ముందు పెట్టి అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆయన అన్నింటికి సరైన సమాధానాలు చెప్పడం లేదని సమాచారం.