అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు (SIB Chief Prabhakar Rao) విచారణ ముగిసింది. ఆయన కస్టడి ముగియడంతో పోలీసులు విడుదల చేశారు.
సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావును పోలీసులు 14 రోజులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనను సిట్ అధికారులు విచారించారు. కీలక విషయాలు రాబట్టారు. డిసెంబర్ 25తో ఆయన కస్టడీ ముగిసింది. దీంతో శుక్రవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం ప్రభాకర్‌రావు ఇంటికి వెళ్లిపోయారు. రిటైర్మెంట్ తర్వాత ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావుని మళ్ళీ నియమించడంపై సిట్ ప్రశ్నించింది. ఎందుకు నియమించారో కేసీఆర్ (KCR)నే అడగాలని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ట్యాపింగ్ డేటా అంతా నేరుగా సీఎం కార్యాలయానికే (Chief Minister Office) రిపోర్ట్ చేశాడని మాజీ డీజీపీ విచారణలో వెల్లడైంది. ప్రభాకర్‌రావు విచారణ నివేదికను జనవరి 16న సుప్రీం కోర్టుకు సిట్ అధికారులు (SIT Officers) నివేదించనున్నారు.
Phone Tapping Case | తర్వాత ఏంటి
ప్రభాకర్‌రావు నుంచి సిట్ అధికారులు కీలక వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల అనంతరం మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కు ఈ కేసులో నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా సిట్ అధికారులు ప్రభాకర్‌రావును మరో నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిసి విచారించారు. బీఆర్ఎస్ నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. దీని వెనక టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో త్వరలో గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.