అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుకు గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో కస్టడీకి ఈ నెల 11న ధర్మాసనం అనుమతి ఇచ్చింది. దీంతో 12న ఆయన పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. వారం రోజుల పాటు విచారించినా ప్రభాకర్‌రావు (Prabhakar Rao) అధికారులకు సహకరించడం లేదు. ఏ విషయానికి సరైన సమాధానం చెప్పడం లేదని తెలిసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన కస్టడీ గడువు గురువారంతో ముగిసింది. దీంతో పోలీసులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Phone Tapping Case | ఈ నెల 25 వరకు
పోలీసుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభాకర్‌రావు కస్టడి పొడిగింపునకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 25 వరకు ఆయన పోలీస్ కస్టడీ (Police Custody)లో ఉండనున్నారు. 26న విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును కోర్టు ఆదేశించింది.
Phone Tapping Case | నోరు విప్పడం లేదు
విచారణలో ప్రభాకర్‌రావు నోరు విప్పడం లేదు. అన్ని అధికారుల ఆదేశాల మేరకు చేసినట్లు చెబుతున్నారు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారమే హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేశానని చెప్పినట్లు తెలిసింది. వారం రోజుల విచారణ వివరాలను అధికారులు కోర్టు ముందు ఉంచారు. దీంతో మరో వారం కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాగా ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణలో వేగం పెరిగే అవకాశం ఉంది. సిట్ అధికారులు (SIT Officers) కీలక అంశాలు రాబట్టే ఛాన్స్ ఉంది.