HomeతెలంగాణPhone Tapping | ప్రభాకర్​రావు ముందస్తు బెయిల్​ రద్దు చేయాలి.. సుప్రీంను ఆశ్రయించిన సిట్​

Phone Tapping | ప్రభాకర్​రావు ముందస్తు బెయిల్​ రద్దు చేయాలి.. సుప్రీంను ఆశ్రయించిన సిట్​

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితుడు ఎస్​ఐబీ మాజీ చీఫ్​ను అరెస్ట్​ చేయడానికి అనుమతించాలని సిట్​ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరగనుంది. బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, జడ్జీలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై సిట్​ (SIT) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించారు. ప్రధాన నిందితుడు ఎస్​ఐబీ (SIB) మాజీ చీఫ్​ ప్రభాకర్​రావును సైతం పలుమార్లు విచారించారు. అయితే ఆయన అధికారులకు సహకరించడం లేదు. మరో నిందితుడు ప్రణీత్​రావును సిట్​ ఇప్పటికే అరెస్ట్​ చేసింది. ఫోన్​ ట్యాపింగ్​ కేసు బయట పడటంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్​ రావు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్​ తీసుకున్నారు. కోర్టు అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించడంతోనే ఆయన ఇండియాకు వచ్చారు.

Phone Tapping | అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిట్​ అధికారులు ఆశ్రయించారు. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్ టాప్​లో ఆధారాలు ధ్వంసం చేశారని పిటిషన్​లో పేర్కొన్నారు. FSL రిపోర్ట్ లో తేదీలతో సహా ఉంది, మొత్తం డేటాను రీసెట్ చేశారని తెలిపారు.

ప్రభాకర్​రావు జడ్జీలు,రాజకీయ నాయకులు, జర్నలిస్ట్​ల ఫోన్లను ట్యాపింగ్ చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంలో నేడు విచారణ జరగనుంది. అయితే కోర్టు ఆయన అరెస్ట్​కు గ్రీన్​ సిగ్నల్​ ఇస్తుందా లేదా చూడాలి. ఒకవేళ ప్రభాకర్​రావు అరెస్ట్​కు ఆమోదం తెలిపితే.. ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.