ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | ముగిసిన ప్రభాకర్​రావు విచారణ

    Phone Tapping Case | ముగిసిన ప్రభాకర్​రావు విచారణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు (Prabhakar rao) విచారణ మూడో రోజు ముగిసింది. శనివారం సిట్​ (SIT) అధికారులు ఆయనను తొమ్మిది గంటల పాటు విచారించారు. శుక్రవారం సిట్​ అధికారులు ఈ కేసులో ప్రణీత్​రావును మళ్లీ విచారించారు. ఆయన స్టేట్​మెంట్​ ఆధారంగా ప్రభాకర్​రావుపై సిట్​ ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం ఆయన స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు.

    Phone Tapping Case | మూడో సారి..

    సిట్​ అధికారులు ప్రభాకర్​రావును మూడు రోజులు విచారించారు. మొదట జూన్​ 9న 8 గంటల పాటు ఆయనను విచారణ జరిపారు. అనంతరం జూన్​ 11న, శనివారం తొమ్మిది గంటల చొప్పున​ ఎస్​ఐబీ మాజీ చీఫ్​ను ఇన్వెస్టిగేట్​ చేసింది. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదని సమాచారం. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాట వేసినట్లు తెలిసింది. కాగా.. ఈ నెల 17న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్​రావును సిట్​ ఆదేశించింది.

    బీఆర్​ఎస్(BRS)​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​ (SIB Chief)గా కొనసాగిన ప్రభాకర్​రావు ప్రతిపక్ష నాయకులతో పాటు, సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్​ ట్యాపింగ్​ చేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణకు సిట్​ను నియమించింది. అయితే ప్రధాన నిందితుడైన ప్రభాకర్​ రావు ఇన్ని రోజులు అమెరికాలో ఉండటంతో విచారణ ముందుకు జరగలేదు. అయితే సుప్రీంకోర్టు ఆయనకు అరెస్ట్​ నుంచి రక్షణ కల్పించడంతో జూన్​ 8న హైదరాబాద్​ వచ్చారు. ఈ క్రమంలో సిట్​ అధికారులు ఆయనను మూడు సార్లు విచారించారు.

    More like this

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...