అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone tapping case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) త్వరలోనే కొలిక్కి రానుంది. ఈ కేసులో కీలక నిందితుడైన అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (Special Intelligence Bureau) ఓఎస్‌డీ, రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు (IPS Prabhakar rao) విచారణకు హాజరు కానుండడంతో ఈ కేసు మరోమారు చర్చనీయాంశమైంది. ప్రభాకర్‌రావు వెల్లడించే అంశాలు రాష్ట్ర రాజకీయాలను (State politics) కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఆయన నోరు విప్పితే, అప్పటి రాజకీయ పెద్దలకు ఇబ్బందులు తప్పవన్న చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) ముందు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం (KCR Governament) తమ రాజకీయ ప్రత్యర్థులతో పాటు స్వపక్షంలోని అసంతృప్తి నేతల ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress governament) దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణకు ఆదేశించింది.
Phone tapping case | అమెరికాకు పరారీ..
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అంశం వెలుగులోకి రావడం, ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Governament) ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు తమ పార్టీలోని కొందరు నేతల ఫోన్లు రహస్యంగా విన్నట్లు బయటకు రావడం రాజకీయ దుమారం రేపింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్.. ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారణ చేసే అనేక అంశాలను గుర్తించింది. ఈ కేసుతో ప్రమేయమున్న అప్పటి పోలీసు (Police) అధికారులను అరెస్టు చేసింది. అయితే, ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అప్పటి ప్రభుత్వ పెద్దలు నిర్దేశించిన వారి ఫోన్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారని సిట్ గుర్తించింది. అయితే, ట్యాపింగ్ అంశం వెలుగులోకి రావడం.. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికాకు (America) పారిపోయారు. ఆయనను తిరిగి రప్పించేందుకు సిట్ అనేక ప్రయత్నాలు చేసింది. ఆయనపై లుక్ ఔట్ నోటీసులు (Lookout notice) జారీ చేయడంతో పాటు పాస్‌పోర్టు రద్దు చేయించారు. అలాగే, ఉద్దేశపూరిత నేరగాడిగా ప్రకటించేందుకు కోర్టును ఆశ్రయించారు. ప్రభాకర్‌రావును ఆ దేశం నుంచి పంపించేసేందుకు (డిపోర్ట్) అమెరికా ప్రభుత్వంతో (America Governament) సంప్రదింపులు జరిపారు.
Phone tapping case | సుప్రీం ఆదేశాలతో తిరిగి రాక..
ప్రభుత్వం పట్టుదలగా వ్యవహరిస్తుండడంతో ప్రభాకర్‌రావు (Prabhakar rao) పునరాలోచనలో పడ్డారు. తన చుట్టూ ఉచ్చు బిగుస్తుందని గమనించిన ఆయన.. సుప్రీంకోర్టును (Suprem court) ఆశ్రయించారు. తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ, ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును ఆయన కోరారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చే వరకు ప్రభాకర్‌రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఆయనకు పాస్‌పోర్ట్ (Passport) అందజేయాలని సూచించింది. పాస్ పోర్టు అందిన మూడు రోజుల లోపు భారత్‌కు తిరిగి వచ్చి.. దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని ప్రభాకర్‌రావుకు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు (Supremcourt) ఆదేశాల నేపథ్యంలో ఇండియాకు తిరిగి రానున్నారు. జూన్ 5వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.
Phone tapping case | నోరు విప్పితే వారికి కష్టమే..
విచారణకు హాజరు కానున్న ప్రభాకర్‌రావు దర్యాప్తు బృందం ఎదుట ఏం చెప్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన విచారణకు సహకరిస్తారా.. లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) చేశారు.. ఎందుకోసం చేశారు.. సేకరించిన సమాచారాన్ని ఏం చేశారు.? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు ఆదేశించారనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఆయన నోరు విప్పి అసలు విషయాలు వెల్లడిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కల్లోలం రేగుతుందన్న చర్చ జరుగుతోంది. ప్రభాకర్‌రావు వాస్తవాలు చెబితే అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందులు తప్పవు. తనను రాజకీయంగా తీవ్రంగా వేధించిన వారిని.. కీలక ఆధారాలు దొరికితే వదిలి పెట్టేందుకు రేవంత్‌రెడ్డి (Revanth reddy) సిద్ధంగా లేరు. ప్రభాకర్‌రావు చెప్పే అంశాల ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను బుక్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవిత ఎపిసోడ్‌తో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన బీఆర్ఎస్‌కు (BRS) ప్రభాకర్‌రావు రూపంలో మున్ముందు ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.