అక్షరటుడే, ఇందూరు : Power Cut | నగరంలోని శుక్రవారం విద్యుత్ సరఫరాలో కోత విధించనున్నట్లు ఏడీఈ చంద్రశేఖర్ (ADE Chandrasekhar) తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
వినాయక నగర్ ఉపకేంద్రం నుంచి గాయత్రి నగర్ ఫీడర్ వరకు శుక్రవారం విద్యుత్ సరఫరాలో (Power Supply) అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. ఇందులో భాగంగా అన్నపూర్ణ అపార్ట్మెంట్, స్నిగ్ధ అపార్ట్మెంట్స్, సాయరెడ్డి అపార్ట్మెంట్స్, శ్రీ సాయి అపార్ట్మెంట్, వెంకీ స్కై అపార్ట్మెంట్, సంకట విమోచన హనుమాన్ టెంపుల్, భూలక్ష్మి మాత ఆలయం ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.