అక్షరటుడే, ఇందూరు: Power Cut | నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ అంతరాయం ఏర్పడనున్నట్లు ట్రాన్స్కో (Transco) టౌన్ ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. పెద్ద బజార్ చౌరస్తా నుంచి గోల్ హనుమాన్ వరకు విద్యుత్ సరఫరాలో కోత విధించనున్నట్లు పేర్కొన్నారు.
గణపతి నిమజ్జనం (Ganesh Nimajjanam) సమయంలో విగ్రహాలకు విద్యుత్ తీగలు అడ్డుతగలకుండా ఎత్తు పెంచడానికి నూతన స్తంభాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కావున మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.