అక్షరటుడే, ఇందూరు: Power Cut | నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో (Transco) టౌన్ ఏడీఈ చంద్రశేఖర్ (Town ADE Chandrasekhar) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. పులాంగ్ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కరెంటు ఉండదని ఆయన వివరించారు.
Power Cut | ఏయే ప్రాంతాల్లో..
నగరంలోని వినాయక్ నగర్ (Vinayak nagar), రానా టవర్, అభ్యాస స్కూల్ (Abhyasa School), ఆకాశ్ అపార్ట్మెంట్స్, శివాలయం, కాకతీయ స్కూల్ (Kakatiya School), దేవి టాకీస్, వేణుమాల్ (Venu Mall), పులాంగ్ రైతు బజార్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఆయన వివరించారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.